Friday, March 13, 2026

గీత కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై సమాచారం

  • గీత కార్మికులకు జరుగుతున్న అన్యాయంపై పూర్తి సమాచారం ఆర్టిఐ ద్వారా అందించాలి
  • ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ భాస్కర్ కలిసిన నేషనల్ హ్యూమన్ రైట్స్& జస్టిస్ మూమెంట్ జిల్లా కమిటీ

నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : ఎన్ టి పి సి.ప్రభావిత గ్రామాలై,ఎల్కలపల్లి,లక్ష్మీపురం గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈరోజు ఆర్టిఐ ద్వారా పూర్తి సమాచారం అందించాలని పెద్దపల్లి జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ కోరడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి అదే వృత్తిని నమ్ముకుని బతుకుతున్న గీత కార్మికులు ఇప్పుడు ఎన్టిపిసి బూడిద చెరువు కొరకు సోలార్ ప్లాంట్ కొరకు చెట్లు మొత్తం తొలగించడం ద్వారా జీవనోపాధి కోల్పోయిన గౌడ కులస్తులకు అరకురా నష్టపరిహారం ఇచ్చి మీకు చెట్లపై ఎలాంటి హక్కు లేదని అంటున్నారని, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ మహేందర్ గౌడ్ తెలుపగా రోజు పూర్తి సమాచారం ఆర్టిఐ ద్వారా ఇవ్వాలని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ భాస్కర్ కోరినట్లు తెలిపారు, తర్వాత కలెక్టరేట్ ఆఫీస్ లో పౌర సమాచార అధికారిని ఆర్టిఐ సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ సి. పెద్దపల్లి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నామతాబాద్ కిరణ్ జి, ఉపాధ్యక్షులు కర్రావుల రామరాజు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News