Saturday, March 21, 2026

అన్నం పెట్టే అన్నదాతలకు అన్యాయం

  • వీణవంక మండలంలోని వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో ఫర్టిలైజర్ ల దోపిడి….

నేటి సాక్షి, వీణవంక :
వీణవంక మండలంలోని రోజు రోజుకు దోపిడి ఎక్కువైతుందని రైతులు ఆవేదన వ్యక్తపరిచారు. ఆన్లైన్లో గాని యూట్యూబ్ సోషల్ మీడియాలో వచ్చే మోసపూరితమైన పిలకలు మరియు క్రిమిసంహారక మందులు సర్టిఫికెట్ లేని మందులు ఫర్టిలైజర్ లో అమ్మడం జరుగుతుంది. వాటికి సరి అయిన సర్టిఫికెట్ లేకుండా మరియు రైతులకు ఎలాంటి బిల్లు ఇవ్వకుండా అమ్మడం జరుగుతుంది. దీనివల్ల అన్నదాత అధిక పెట్టుబడి పెట్టి తక్కువ దిగుబడితో తీవ్ర నష్టపోతున్నాడు. వీణవంక మండల వ్యవసాయ అధికారి ఎక్కువ రోజు కూడా ఫర్టిలైజర్ లో తనిఖీలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడు. దీనివల్ల ఫర్టిలైజర్ వాళ్ళు వాళ్లకు నచ్చినట్లు అడ్డగోలు బిల్లులు తీసుకొని రైతులను మోసం చేస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అన్నదాతను ఆదుకునే వ్యవసాయ అధికారుల ఇలా అక్రమ దారిని ఎంచుకోవడం హాస్యాస్పదంగా ఉంది. దీనివల్ల రైతులు తీవ్ర నష్టపోతున్నారని వీణవంక మండల రైతులు గుసగుసలాడుతున్నారు. దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి మోసాలను అరికట్టాలని అన్నదాతలకు ఆదుకునే విధంగా ఉండాలే వ్యవసాయ అధికారులని వీణవంక మండల రైతులు పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి తూతూ మంత్రం లెక్క తనిఖీలు చేసి వెళ్లిపోవడంతోనే మళ్లీ యధావిధిగా దందాలు నడిపిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వెంటనే స్పందించి దీని అరికట్టాలని మోసాలకు పాల్పడే వాడిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీణవంక మండలం రైతులు వేరుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News