Tuesday, March 17, 2026

కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం

నేటి సాక్షి, మందమర్రి:– కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేవలం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలపైనే కేంద్రం ఆసక్తి చూపడం విచిత్రమని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నోముల ఉపేందర్ గౌడ్, నాయకులు మంద తిరుమల్ రెడ్డి, సోత్కు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్, పైడిమల్ల నర్సింగ్ లు తెలిపారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి నిరసనగా పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం వద్ద టిపిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ల ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం అంటే చిన్న చూపు అని విమర్శించారు. రాష్ట్రంలో 8 మంది ఎంపీ లు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా రాష్ట్రానికి న్యాయం చేయకుండా, బడ్జెట్ రాకుండా చేసిన కేంద్రాన్ని ప్రశ్నించలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పథంలో పోవడాన్ని చూసి జీర్ణించుకోలేక కేంద్రంలోని బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇవ్వకుండా మొండి చేయి చూపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నేరువట్ల శ్రీనివాస్, ఎండి జమీల్, జమాల్ పూరి నర్సోజి, ఆంజనేయులు, ఎర్ర రాజు, కడలి శ్రీనివాస్, దుర్గం ప్రభాకర్, వడ్లూరి సునీల్ కుమార్, గణేష్, రంజిత్, శ్రీనివాస్, వేణు, రాంబాబు, ప్రదీప్, రవి, రాము, కృష్ణ, పాణి, యువజన కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, బియ్యపు రవి కిరణ్, రాజేష్, శేఖర్, సోత్కు ఉదయ్, సురేందర్, గణేష్, సూరజ్, రాజు లు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News