Sunday, March 22, 2026

భూమికి జీవం వినూత్న సేంద్రియ ఎరువులు

  • రైతు బడి అగ్రి షో లోఆకట్టుకున్న వినూత్న అగ్రోటెక్ ఉత్పత్తులు

నేటి సాక్షి రాప్తాడు ఆళ్లగడ్డ: భూమికి జీవం వినూత్న ఆగ్రోటెక్ ఎల్.ఎల్. పి వారి సేంద్రిఏరులతోపాటు జీవన ఎరువులు ద్వారా రైతన్నల ఆర్థిక అభివృద్ధి చెందుతుందని వినూత్న త్న ఆగ్రోటెక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఏ ఎస్ ఎం .చిన్న కేశవ, నాగారాజు, ఏస్ ఓ.ఉదయ రెడ్డి ,హరి డి ఎండి టీం . బిల్లా రాజేష్ యాదవ్ ,ప్రవీణ్ ,వినీత్ పవన్ , దంన్ల లు పేర్కొన్నారు. శనివారం రైతు బడి అగ్రీ షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాప్తాడు శాసన సభ్యురాలు పరిటాల సునీతమ్మ, పరిటాల శ్రీరామ్ లుపాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వినూత్న అగ్రోటెక్ ఎల్ పి వారి ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శాసనసభ్యులు పరిటాల సునీతమ్మ మాట్లాడుతువినూత్న అగ్రోటెక్ ఎల్ ఎల్ పి వారి సేంద్రియ జీవన ఎరువులు రైతన్నలకు ఎంతో ఉపయోగకరమని మంచి పంటలు అధిక దిగుబడులు సాధించేందుకు దోహత పడతాయన్నారు. అనంతరం వినూత్న అగ్రో టెక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు యంత్రాలను ప్రదర్శించటం పట్ల రైతు సోదరులు కొత్త వరవడితో నూతన టెక్నాలజీతో , మరియు ఆరోగ్యకరమైన పంటలు పండించేందుకు సేంద్రియ ఎరువులు ఉపయోగించుకుంటూ అధిక దిగుబడును సాధించేందుకు వీలవుతుందన్నారు. అలాగే తమ సంస్థ ఉత్పత్తులైన సేంద్రియ ,జీవన ఎరువుల వాడటం వల్ల అధిక దిగుబడును సాధ్యమై అన్నదాతల ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరిచేందుకు దోహదపడతాయి అన్నారు. పంటల తెగుళ్లు తట్టుకుని అధిక దిగుబడి సాధించేందుకు వీలవుతుందన్నారు. వినూత్న అగ్రి టెక్ ఎల్.ఎల్. పి వారి ఉత్పత్తులైన సేంద్రియ ఎరువులనురైతు సోదరులు వాడటం వల్ల అధిక దిగుబడులు సాధించవచ్చు అన్నారు.రైతులకు అందించే సేంద్రీయ జీవన ఎరువులైనా “యోధ సేంద్రియ ఎరువులు, యోధ సి ఎం ఎస్ జీవన్ గోల్డ్, రైతుమిత్ర, ప్రణయ్, గ్రో హై గ్రాన్యూల్స్, గ్రో హై లిక్విడ్, డెల్టా ప్రో, తులిప్, యువరాజ్, డైనమైట్, జనని, ట్రిగర్ , టర్బో కే జి ఎఫ్6, రోషిని, ఉజ్వల్ , త్రిసూల్, ధర్మవీర్ , రత్నా, పృధ్వీరాజ్, తిరంగా, నైట్స్, త్రిలోక్, ఇగ్నిస్ 5 అవనీ న్యూట్రిన్, అవనీ గోల్డ్, అవనీ జింక్ ప్లస్ (జెడ్33%+ఎస్15%), అవనీ న్యూట్రిసోల్ కే ఎం ఎస్-22.18.20), అవనీ కాబన్, అవనీ సీ గోల్డ్ (పౌడర్/గ్రానువాల్స్) , అవనీ సీ గోల్డ్ (లిక్విడ్), అగ్ని, విభా ప్లస్, వాల్ట్, ధన్వి , వాల్ యు ప్యాక్, టిల్లరింగ్ బోస్టర్, సాయిల్ రిసువేటర్, లను పంటకు వాడి భూమిలోని మిత్ర పురుగులు అయినటువంటి సూక్ష్మజీవులను అభివృద్ధి చేసి మొక్కలకు కావాలసిన పోషకాలను అందించి మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని రైతులకు తెలిపారు. “వినూత్న ఆగ్రో టెక్ఎల్.ఎల్.పి.” సంస్థ గత 2 సం॥రాలుగా సేంద్రీయ, జీవన ఎరువులను అందిస్తూన్నారు. పలు గ్రామాల్లో సేంద్రీయ జీవన ఎరువులపై “రైతు అవగాహన సదస్సు ” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతు సోదరులు అగ్రికల్చరల్ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News