ఎంపీడీవో గుండె బాబు
నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు):
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ గ్రామంలో సోమవారం రోజున మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు ఉప్పల్ గ్రామపంచాయతీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం నిర్వహిస్తున్న సర్వేల బృందాలను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రతి ఒక్క పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారి గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన సర్వే అనతి కాలములో పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. మండలంలో ప్రజాపాలన కింద ఇల్లు కావాలని 18,618 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇట్టి దరఖాస్తులను పరిశీలించడానికి 33 బృందాలకు లాగిన్స్ ఇచ్చి సర్వే నిర్వహించడం జరుగుతున్నదని లాగిన్ ఉన్న ప్రతి ఒక్క బృందము ప్రతిరోజు విధిగా కనీసం 25 కుటుంబాలను సర్వే నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బైరి శ్రీనివాస్ గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.