Tuesday, March 24, 2026

ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణ కేంద్రాల పరిశీలన

  • తగు సూచనలు చేసిన ఎంపీడీవో, సిఐ

నేటి సాక్షి, కమలాపూర్ (నాగరాజు పటేల్ ఎడ్ల) : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి గుండె బాబు,సిఐ హరికృష్ణ క ZPSS కమలాపూర్ బాలికల పాఠశాలలో ఈనెల 27వ తేదీన జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పోలింగ్ నిర్వహణ కేంద్రాలను పరిశీలించడం జరిగింది. పోలింగ్ నిర్వహణ కేంద్రంలో పోలింగ్ సిబ్బందికి సరైన సౌకర్యాలు ఉన్నాయా లేవా అనే అంశం పై అదేవిధంగా ఓటర్లు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఓటు వేసే విధంగా అక్కడ సౌకర్యాల ఏర్పాటు గురించి పరిశీలన చేసి తగు సూచనలు చేయడం చేసారు. అనంతరం ఆ పాఠశాలలో నిర్వహిస్తున్న అంగన్వాడి కేంద్రాన్ని మరియు అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు ఇచ్చే ఆహార పదార్థాలను పరిశీలించడం తో పాటుగా విద్యార్థుల యొక్క చదువు వారి యొక్క నైపుణ్యాన్ని పరీక్షించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News