Thursday, April 2, 2026

గురుకులాల్లో విద్యార్థులకు గీజర్లు ఏర్పాటు చేయండి..!

  • శాసనసభలో గురుకులాల పై చర్చలో ప్రస్తావించిన విప్ ఆది శ్రీనివాస్

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ: ( కోక్కుల వంశీ ) : రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, సోలార్ పవర్ ఆధారిత గీజర్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ శాసనసభలో గురుకులాల నిర్వహణపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన, విద్యార్థుల సౌకర్యాన్ని పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థులు వేకువజామున లేచి చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, అందుకే అన్నీ హాస్టళ్లలో గీజర్లను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని గురుకుల హాస్టళ్లలో ఇప్పటికే సోలార్ పవర్ ఆధారిత గీజర్లు ఉన్నప్పటికీ, చాలా స్కూళ్లలో ఈ సదుపాయం అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ప్రాప్యత ఉన్న అన్ని గురుకులాల్లో తక్షణమే గీజర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ విప్ శ్రీ ఆది శ్రీనివాస్ శాసనసభ వేదికగా ప్రభుత్వానికి సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News