- మండల విద్యాధికారి మేకల చంద్ర శేఖర్
నేటి సాక్షి, మెట్ పల్లి ప్రతినిధి : ప్రతి విద్యార్థి భౌతిక రసాయన శాస్త్రం పట్ల ఆసక్తిని పెంచుకొని ఆ సబ్జెక్ట్ ను బాగా చదివితే వారు భవిష్యత్ లో మంచి ఇంజనీర్లు, డాక్టర్లు కాగలరని మెట్ పల్లి మండల విద్యాధికారి చంద్ర శేఖర్ విద్యార్థులకు సందేశాన్నిచ్చారు. మెట్ పల్లి ఫోరం ఆఫ్ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మండల ఫిజికల్ సైన్స్ టాలెంట్ టెస్ట్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని విద్యా వసతులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు.ప్రభుత్న ఉన్నత పాఠశాల మెట్ పల్లిలో నిర్వహించిన ఈ పోటీలోజడ్పిహెచ్ఎస్ బాలుర పాఠశాలకు చెందిన యన్. హిమకర్ ప్రథమస్థానం, జడ్పిహెచ్ఎస్ వెల్లుల కు చెందిన సత్యనారాయణ మరియు జడ్పిహెచ్ఎస్ మెట్లా చిట్టాపూర్ కు చెందిన విద్యా ర్థులు ద్వీతీయ స్థానాల్లో నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు రాజేందరరావు, ఎఫ్పిఎస్టి అధ్యక్షులు రవీందర్, కార్యదర్శి నరసింహచారి, ఉపాధ్యక్షురాలు మమత, భౌతిక శాస్త్ర ఉపాద్యాయులు పాల్గొన్నారు.





