Thursday, March 26, 2026

మార్చి 05 నుండి 25 వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు

  • జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

నేటి సాక్షి , మునగాల : సూర్యాపేట జిల్లాలో మార్చి 05 నుండి 25 తేదీ వరకు ఉదయం 9:00 గం”నుండి మధ్యాహ్నం 12:0 0 గం”వరకు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రకటించారు. సూర్యాపేట జిల్లా మొత్తం 32 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని. సూర్యాపేట జిల్లా కేంద్రంలో (13) పరీక్ష కేంద్రాలు, కోదాడ (08) నడిగూడెం(02) హుజుర్ నగర్ (02) మఠంపల్లి (01) నేరేడుచర్ల (01) తిరుమలగిరి (02) తుంగతుర్తి (02) ఆత్మకూర్ (ఎస్) (01) పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని సూచించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News