Monday, March 30, 2026

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల హుజురాబాద్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు B తిరుమల మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో పురుషులతో సమానంగా రానిస్తున్నారు. బాలికలు బాగా చదివి అన్ని రంగాలలో రానించాలన్నారు. ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడి దారి వ్యవస్థ మహిళలను మార్కెట్ వస్తువుగా మర్చిందని, ఎక్కడైతే మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామజికంగా అన్నిహక్కులు పొందుతారో అక్కడ నిజమైనా అభివృద్ధి సాధించినట్లు అని అన్నారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయినులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సమావేశంలో HM తిరుమల, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఆసియ, రోజరాణి, అర్చన అవస్తీ, మాధవిలత, శ్రీలత, శ్రావణి, అనూష, శారద, ఈశ్వర్ రెడ్డి, మారుతీ ప్రసాద్, శ్రీనివాస్, సదానందం పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News