నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : గోదావరిఖని జనక్ భవన్‌లో యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్.అధ్యక్షతన ఘనంగా జరిగింది. సమావేశానికి మూడు ఏరియాల నుండి సెంట్రల్ నాయకులు ,వైస్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. సమావేశంలో ప్రధాన రీజియన్‌లోని అన్ని ఏరియా పిట్ కమిటీల నిర్మాణం, బలోపేతం. యూనియన్ బలోపేతం కోసం గనుల వద్ద బాయి బాట నిర్వహించి కార్మికులకు బొగ్గు గనుల వేలం గురించి అవగాహన కల్పించడం. సింగరేణి రణభేరి యాత్ర, సింగరేణి తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనపై చర్చ యూనియన్ వికేంద్రీకరణపై దృష్టి పెట్టడం.
ఈ సమావేశానికి సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, జనరల్ సెక్రటరీలు లక్ష్మీపతి గౌడ్, వికాస్ కుమార్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు శేషా రత్నం, RG-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం, RG-2 వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, RG-3 వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు దాస్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, రీజినల్ జనరల్ సెక్రటరీ ఆరెపల్లి శ్రీనివాస్, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ పోతరబోయిన సమ్మయ్య, జాయింట్ జనరల్ సెక్రటరీలు గడ్డం కృష్ణ, దేవులపల్లి రాజేందర్, బత్తుల పోచయ్య, గండ్ర దామోదర్, డిప్యూటీ జనరల్ సెక్రటరీలు సంపత్ రెడ్డి, భీమిని సత్యనారాయణ, బేబీ శ్రీనివాస్, సెంట్రల్ సెక్రటరీలు రామారావు, నవీన్ కుమార్, సాయి కృష్ణ, పుట్ట రమేష్, మండ రమేష్, మహిళా నాయకురాలు శ్రీమతి రెడ్డి, సుశీల, లలిత శ్రీతో పాటు సెంట్రల్ కమిటీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.





