బిజెపి నాయకులు నర్ర శ్రీనివాస్ రెడ్డి
నేటిసాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
శీతాకాలం యాసంగి సమయంలో రైతులు భూమిని దున్నడానికి సిద్ధంగా ఉన్నా, ఎస్.ఆర్.ఎస్.పి కెనాల్ లో నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని బిజెపి నాయకులు నర్ర శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎల్.ఎం.డి.లో సరిపడా నీళ్లు ఉన్నప్పటికీ పొలాలు దున్నే సమయానికి మీరు అందించకుంటే రైతులకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ లు రైతుల ఆవేదనను అర్ధం చేసుకొని రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు.