- నిస్వార్ధంగా పంచాయతీ విభజనకు పోరాడుతున్న జాయింట్ యాక్షన్ కమిటీ

నేటి సాక్షి/(దమ్మపేట). జిల్లా ప్రతినిధి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని మందలపల్లి పంచాయతీ సుమారు 7000 జనాభా కలిగినటువంటి పెద్ద పంచాయతీ. అయితే అప్పట్లోనే ప్రకాష్ నగర్ గాంధీ నగర్ మందలపల్లి నుండి విభజించి ప్రత్యేక పంచాయతీ చేయడానికి అవకాశం వచ్చింది. కానీ కొన్ని కారణాలవల్ల అది అప్పుడు నిలిచిపోయింది.
మళ్లీ ఇటీవల ప్రభుత్వం మరి కొన్ని పంచాయితీలకు అవకాశం కల్పించింది. ప్రతిపాదనలు పంపాలని ఆదేశించింది, కానీ ఇంతటి జనాభా ఉన్న ఈ పంచాయతీ గురించి ఎటువంటి ప్రతి పాదనలు వెళ్లకపోవడం గమనార్హం. మొదటిసారే అవకాశం కోల్పోయిన పంచాయితీ ప్రకాష్ నగర్ కాగా, ఇప్పుడు గాంధీనగర్, ప్రకాష్ నగర్ కలుపుకొని పంచాయతీ కావాలని మళ్లీ ప్రయత్నాలు చేపట్టారు, ఇప్పుడు కూడా చివర సమయంలో కొందరు స్పృహలోకి రావడంతో దీనిపై కసరత్తు మొదలైంది, పార్టీలకతీతంగా అందరూ తమ ప్రాంత అభివృద్ధికి ఏక స్వరంతో జేఏసీగా ఏర్పడి స్థానిక ఎమ్మెల్యేకి అధికారులకు వినతులు సమర్పించారు, ఇటువంటి రాజకీయ విభేదాలు ఉన్న ఇది తమ ప్రాంత అభివృద్ధి కొరకు కాబట్టి అన్ని పక్కన పెట్టి పోరాటం కొనసాగిస్తామని జే ఏ సి సభ్యులు తీర్మానించుకున్నారు, ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా 200 పంచాయితీలు దమ్మపేట మండలంలో చిన్న గొల్లగూడెం లాంటి పంచాయతీ లను ఇప్పటికే ప్రకటించినట్టు పత్రికల్లో రావడంతో, ఇక దీని ఏర్పాటు ఒక్క ఎమ్మెల్యే చేతిలోనే ఉండడం ఎమ్మెల్యే కే అంతటి ప్రత్యేక అధికారం ఉంటుంది కాబట్టి, చివరి సమయం కావడంతో దీనిపై స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పై తీవ్ర వత్తిడిని తీసుకొస్తున్నారు, దీంతో ఎమ్మెల్యే జారే తన వంతు ప్రయత్నం గట్టిగానే చేస్తానని అభయమిచ్చారు. ఏ విధంగానైనా పంచాయతీ విభజన జరిగినట్లయితే రెండు పంచాయతీలు సరిపడా నిధులతో అభివృద్ధి చెందుతాయని మెజార్టీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ కొందరి స్వలాభం కోసం కూడా దీని ఏర్పాటు ఆటంకాలు కలిగిస్తున్నారని ఇక్కడ ప్రజలు బహిరంగమ్గానే చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే జారే ప్రత్యేక చొరవతో దీని ఏర్పాటు సుసాధ్యం చేస్తారని గంపడాశ తో ఇక్కడి ప్రజలు వేచి చూస్తున్నారు. ఇక మంత్రులకు కూడా తమ వినతులను సమర్పించే పనిలో ఉన్నారు, అప్పటికి అది సాధ్యం కాకపోతే రిలే నిరాహార దీక్షలు, పంచాయతీ ఎలక్షన్ల బహిష్కరణకు కూడా వెనుకాడబోమని, దీనికై కోర్టుల దాకా కూడా వెళతామని, ఈ ప్రాంత అభివృద్ధికి పంచాయతీల విభజన అవసరం ఎంతైనా ఉందని స్థానిక ప్రజలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. మరి ఇప్పుడు ఇది నెరవేరుతుందో, ఎప్పటిలాగానే “అందరని ద్రాక్ష”గానే మిగులుతుందో వేచి చూడాలి.

