Wednesday, March 18, 2026

పల్లె ప్రకృతి వనమా, నక్కలు కాపురం చేసే గుప్పనా

  • నీరులేక ఎండిపోతున్న మొక్కలు
  • చోద్యంగా చూస్తున్న ప్రభుత్వ అధికారులు

నేటిసాక్షి, వాజేడు : గత రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పల్లెల్లో ఆహ్లాదకరమైన వతవారణన్ని కల్పించాలని ఉద్దేశంతో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పల్లె ప్రకృతి వనలను ఏర్పాటు చేసింది.ములుగు జిల్లాలోని వాజేడు మండలం చండ్రుపట్ల గ్రామపంచాయతీలో పల్లె ప్రకృతి వనం కొరకు పేద రైతుల ఎండు మిరపకాయలు పోసుకునే కల్లలు చేసే భూమిని కబ్జా చేశామా, మొక్కలు నటమా, ఓదిలేసామా అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి కనిపిస్తుంది. చండ్రుపట్ల గ్రామపంచాయతీలో ఏకగ్రీవంగా ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటే గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు అనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకుంటే పల్లె ప్రకృతి వనంను గత సర్పంచ్ ఇర్ప సమ్మక్క, ఉప సర్పంచ్ నరెడ్ల రమేష్ పట్టించుకోలేదని వెసవికాలంలో మొక్కలకు నీరు అందించలేదని, పార్కులో పిచ్చి మొక్కలను తీసివేయలేని ఈలాంటి వాళ్లను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకున్నామా అని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. గతంలో ఉన్న గ్రామపంచాయతీ సెక్రటరీలు ప్రస్తుత సెక్రటరీ రవీందర్ కూడ పల్లె ప్రకృతి వనం దగ్గరకు వచ్చి చూసారే తప్ప మొక్కలు పెరగడం లేదని ఎండలకు చనిపోతున్న మొక్కలకు వెసవికాలంలో ప్రతి రోజు నీరు అందించలేదని పిచ్చిమొక్కలు శుభ్రం చేయడం తొలగించలేదని, మొక్కల పెరుగుదలకు ఎరువులు మందులు వేయలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రతి రోజు పల్లెప్రకృతి వనంను చూస్తూ ప్రక్కన ఉన్న రహదారిపై వ్యవసాయ పనులకు వేళ్తున్న గ్రామ రైతులు, కూలీలు పల్లె ప్రకృతి వనం చూస్తూ ప్రజల ఆహ్లాదకారం కొరకు, మొక్కలు పెరిగితే వృక్షాల కింద కూర్చొని చేదా తిరడం కొరకు ఏర్పాటు చేసారా, లేక నక్కలు సంసారం చేయడానికి ఏర్పాటు చేశారా విమర్శిస్తూ మాట్లాడుకుంటున్నారు. పల్లెప్రకృతి వనంను మండల అధికారులు కన్నెత్తి చూడలేదని గ్రామపంచాయతీ ప్రజలు ఆరోపిస్తున్నారు. చండ్రుపట్ల గ్రామపంచాయతీ పల్లె ప్రకృతి వనంను జిల్లా అధికారులు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజ్ పల్లెప్రకృతి వనంపై దృష్టిసరించి పిచ్చి మొక్కలను తొలగించి, ప్రతిరోజు మొక్కలకు నీరు అందించాలని, వాటి సంరక్షణకు తాగు చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News