Wednesday, March 25, 2026

దివ్యాంగుల కు యు డి ఐడి కార్డులు జారీ

  • ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవడంపై అవగాహన కల్పించాలని సెర్ఫ్ సీఈఓ దివ్య

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు): శనివారం వీడియో కన్పరెన్స్ ద్వారా యుడిఐడి, సోలార్ విద్యుత్తు ఏర్పాటుకు మహిళా సంఘాలు డిపిఆర్ అందచేయు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డిఆర్డీఓ, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్య వేక్షకులు, సంక్షేమ శాఖల అధికారులతో సెర్ప్ సిఈఓ దివ్య దేవ రాజన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ పాల్గొనడమైనది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగ లబ్దిదారులకి యూనిక్ డిజబులిటి ఐడి (యూడిఐడి ) కార్డు కొరకు యూ డి ఐడి పోర్టల్ లో ఆన్ లైన్ లో గాని, మీ సేవ ద్వారా కానీ ధరఖాస్తు చేసుకోవచ్చునని ఆమె తెలిపారు. గతంలో జారీ చేసిన సదరం సర్టిపికేట్లకు యూడిఐడి కార్డులు మంజూరు చేయటం జరిగిందని మార్చి 2025 నుండి సదరం సర్టిపికెట్లు జారీ కొరకు యూడిఐడి పోర్టల్ లో లబ్ధిదారులు  దరఖాస్తు చేయుటకు అవగాహన కల్పించాలని సూచించారు. మీ సేవా కేంద్రాల ఆపరేటర్లకి, అధికారులకి శిక్షణ ఇప్పించాలని సూచించారు. దివ్యాంగులు మార్చి మాసం నుండి  యూడిఐడి పోర్టల్ ద్వారా www.swaralambanacard.gov.in ద్వారా ఖచ్చితమైన చిరునామతో సదరం సర్టిపికేట్ కొరకు ధరఖాస్తు చేసుకుంటే చీఫ్ మెడికల్ అధికారి లాగిన్ లోకి వెళ్తుందని తెలిపారు. నిర్దేశించిన  షెడ్యూల్ ప్రకారం  లబ్ధిదారులు ఇచ్చిన సెల్ ఫోన్ కు మెసేజ్ వస్తుందని తెలిపారు. షెడ్యూల్ ఇచ్చిన ప్రకారం లబ్ధిదారులు మెడికల్ క్యాంప్ కు హాజరైతే వైకల్యం శాతాన్ని ప్రత్యేక వైద్యులు పరిశీలించి వికలాంగ శాతాన్ని నిర్ణయిస్తారని తెలిపారు. తదుపరి సర్టిఫికేట్ మంజూరు చేస్తారని, సర్టిపికెట్స్ ఎలాంటి ట్యాంపరింగ్ జరగకుండా వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసి సంతకం చేసిన దృవీకరణ ప్రతులను హాస్పిటల్, డిఆర్డీఓ కార్యాలయాల్లో భద్ర పరచాలని తెలిపారు.  దరఖాస్తు లో నింపిన చిరునామకి యూడిఐడి కార్డు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపటం జరుగుతుందని అన్నారు. సర్టిపికెట్ ను యూడి ఐడి పోర్టల్ నందు డౌన్లోడ్ చేసుకోవచ్చుని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్ లో సర్టిపఫికేట్స్ జారీ చేయుటకు అవసరమైన సామాగ్రీ, టెక్నీషియన్స్, వైద్యులు లబ్దిదారుల  పర్సంటేజ్ పరిశీలించుటకు ప్రత్యేక గది, యూడిఐడి సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫిరెన్స్ లో
అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, డి ఆర్ డి ఓ కౌసల్య దేవి జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, ప్రధాన ఆసుపత్రి  సూపరింటెండెన్ట్ మరియు సంబంధిత అధికారులు  పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News