నేటి సాక్షి, జమ్మికుంట (మోరె ప్రశాంత్) : హుజూరాబాద్ నియోజకవర్గంలో శిథిలావస్థలో ఉన్న బీసీ బాలుర, బాలికల హాస్టల్స్ నూతన భవనాలు నిర్మించాలని, నూతన గ్రంథాలయం ఏర్పాటు చేయాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జిల్లా సహాయ కార్యదర్శి కేశబోయిన రాము యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. హుజూరాబాద్ బీసీ, బాలికల హస్టల్స్ శిథిలావస్థలో ఉన్నాయని, ఇప్పుడు హాస్టల్స్ అద్దె భవనాల్లో నడస్తున్నాయని చెప్పారు. అద్దె భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హాస్టల్స్‌కు నూతన భవనాలు, నూతన గ్రంథాలయం నిర్మాణ విషయంపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దృష్టి పెట్టాలని సూచించారు.
23న జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు, అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టల్స్‌కు కొత్త భవనాలు నిర్మించేలా మాట్లాడి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఎమ్మెల్యే సొంత గ్రామమైన వీణవంక మండల సంబంధించిన ఎంజేపీ గురుకుల పాఠశాల హుజూరాబాద్‌లో అద్దె భవనంలో కొనసాగుతున్నదని, వీణవంకలో కొత్త భవన నిర్మాణానికి కృషి చేయాలని కోరారు.
బీసీ హాస్టల్ అద్దె భవనం మెయిన్ రోడ్డు పక్కన ఉండడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, దీంతో విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేలా చూడాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం హాస్టల్ మెస్ చార్జీలు పెంచాలని, స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని కేశబోయిన రాము యాదవ్ ప్రకటనలో డిమాండ్ చేశారు.
Как быстро и безопасно вскрыть замок в Санкт-Петербурге
как открыть сейф топаз zamkidoloi.ru .
Получите временную прописку в СПб для трудоустройства или учёбы
нужна временная регистрация спб [url=http://www.registraciya-vremennaya-spb.ru/]http://www.registraciya-vremennaya-spb.ru/[/url] .
Купить автоэлектронику в ParkCam — безопасность и комфорт для вашего автомобиля
паркам интернет магазин