Sunday, March 22, 2026

సినిమా రంగంలో కోదాడ వాసులు రాణించడం అభినందనీయం

•సందేశాత్మక చిత్రాలు నిర్మిస్తున్న అజగవా ఆర్ట్స్
•నేనెక్కడున్న మంచి సందేశాత్మక చిత్రం
•సినిమా డైరెక్టర్ మాధవ్ కోదాడ

నేటి సాక్షి కోదాడ ప్రతినిధి: సందేశాత్మక చిత్రాలతో కోదాడ వాసులు సీని రంగంలో రాణించడం అభినందనీయమని అజగవా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన “నేనెక్కడున్న” సినిమా డైరెక్టర్ కోదాడ పట్టణానికి చెందిన మాధవన్ ను కోదాడను పట్టణ ప్రముఖులు అభినందించారు.గురువారం పట్టణంలోని రాయల్ బేకర్ లో సినిమా యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నేనెక్కడున్న సినిమా డైరెక్టర్ మాధవన్ కోదాడ మాట్లాడుతూ… ప్రస్తుతం జర్నలిజం, సామాజిక కోణంలో నేనెక్కడున్న అనే చిత్రాన్ని హిందీ, తెలుగులో నిర్మించినట్లుగా తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత శాంప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తున్నారని , హీరో మిమో చక్రవర్తి, హీరోయిన్ శాషాచత్రి, ప్రముఖునటులు బ్రహ్మానందం పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, షియాజ్ సిండే మహేష్ ముంజేకర్, ల తో పాటు చాలామంది సినీ పరిశ్రమ నటులు ఉన్నట్లుగా తెలిపారు. మంచి సందేశాత్మక చిత్రంతో ప్రజల ముందుకు వస్తున్నామని ప్రజలు ఆదరించాలని కోరారు. కోదాడ పట్టణ వాసిగా అందరికీ సుపరిచితమైన వ్యక్తిని, పట్టణ ప్రజలు ప్రతిభ ఉన్న వ్యక్తులను ప్రోత్సహిస్తుంటారని అన్నారు. రాబోవు చిత్రాలు కోదాడ పట్టణంతో పాటు వివిధ మండలాలలో ప్రతిభ ఉన్న కళాకారులను ప్రోత్సహిస్తానని వారికి తప్పనిసరిగా సినిమాలో అవకాశాలు ఇస్తానని తెలిపారు. ఈనెల 28న ప్రేక్షకులకు ముందు రాబోతున్న చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో ఓ పిట్ట కథ డైరెక్టర్ చందు ముండేటి తదితరులు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News