Wednesday, March 25, 2026

జర్నలిస్టులకు ప్రమాద బీమా కల్పించడం సంతోషకరం

  • జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
  • టీఎస్ జేయు ఆధ్వర్యంలో జర్నలిస్టుల అటాక్స్ కమిటీ పునరుద్ధరించడానికి వినతి పత్రం అందజేత

నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో (రాధారపు నర్సయ్య) : జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన కమిటీని పునరుద్ధరించాలి అని తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సత్య ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పురుషోత్తం నారగౌని ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో యూనియన్ అంద చేస్తున్న ఉచిత ప్రమాద బీమా పత్రాలను సభ్యులకు ఈరోజు కలెక్టర్ అందచేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ..జర్నలిస్టులకు టి.ఎస్.జే.యు ఇస్తున్నటువంటి 5 లక్షల వ్యక్తిగత ప్రమాద బీమా ఇవ్వడం ఆ సంతోషకరం అని అన్నారు.విధి నిర్వహణలో భాగంగా ఎంతో మంది జర్నలిస్టులు ప్రమాదాలకు గురై ఇబ్బందులు పడుతుంటారు ఆ సమయంలో వీరికి ప్రమాద బీమా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.టీ.ఎస్.జే.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్ మాట్లాడుతూ… జర్నలిస్టులకు గల సమస్యలను మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో జర్నలిస్టులకు మొదట ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ నీ కోరారు.ఈ కార్యక్రమంలో టీఎస్ జేయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్,రాష్ట్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ అవునూరి సంపత్, కోరుట్ల నియోజకవర్గ కమిటీ గౌరవ అధ్యక్షులు దీకొండ మురళి, అధ్యక్షులు జోరిగే శ్రీనివాస్, ఉపాధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, కోశాధికారి ఓంకారి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి కోయాల్కర్ నరేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడ దివాకర్, మీడియా ఇంచార్జి నన్నాపురజ్ రవిరాజ్, ఈసీ మెంబర్లు పండిత్ రాజేందర్, సయ్యద్ ఫిరోజ్,గట్ల శ్రీనివాస్,దూది గణేష్, సభ్యులు మద్దెనపల్లి నాగేష్, బెజ్జరాపు శ్రీకాంత్, దగ్గుల అశోక్, బెజ్జరాపు శ్రీనివాస్, చొక్కాల రవీందర్, సుద్దాల హరీష్, వెంకటరమణ, గుండవేణి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News