Thursday, March 12, 2026

వర్షాకాలం నాటికి చుక్క నీరు నిలవకుండా చేసే భాద్యత నాది

  • అధికారుల పనీతిరు, ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి
  • 53వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే నాయిని

నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : వచ్చే వర్షాకాలం నాటికి నియోజకవర్గ పరిధిలోని అన్ని కాలనీలలో వర్షపు నీరు నిలవకుండా చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం రోజు 53 వ డివిజన్  విజయ గణపతి కాలనీ, విద్యారన్యపురి, శంకర్ నగర్ పర్యటించారు.కాలనీల్లో ప్రధాన సమస్యలుగా ఉన్న సైడ్ డ్రైనేజీ, అంతర్గత రోడ్ల నిర్మాణం పై ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. కాలానిలో ప్రదానంగా ఉన్న మూడు సీసీ రోడ్లకు, సైడ్ డ్రైన్ లను నిర్మించాలని కాలనీ వాసులు కోరగా వెంటనే సంబంధిత అధికారులను అంచనా వేసుకుని ప్రణాళికలు తీసుకురావాలని ఆదేశించారు. స్థానికంగా కాలానివాసులు కమ్యూనిటీ హల్ ఏర్పాటుకు సహకరించాలని కోరగా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. 10 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలో ఇప్పటికే ప్రధాన కాలనీలలో సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తు వస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ టీ ఏ ఆఫీసియల్ మెంబర్ పల్లకొండ సతీష్, డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్ కావ్య మహేందర్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, కమలాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్, నర్సయ్య, రఘుపతి, రవీందర్, చారి, యుత్ నాయకులు మనీషా, అరుణ్, బాన్ని, అనిల్, రాజీర్, అవినాష్, రాజేష్, చందు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News