- – ఏఐసీసీ ఆదేశాలు తప్పకుండా పాటించాలి
- – కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో పాల్గొనవద్దు.. ప్రచారం చేయవద్దు ..
- – కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు
నేటి సాక్షి, కరీంనగర్: యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు పారదర్శకంగా సజావుగా జరిగేలా ఏఐసీసీ ఆదేశాలను కాంగ్రెస్ నాయకులు పాటించాలని వెలిచాల రాజేందర్ రావ్ సోమవారం సూచించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎవరు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనవద్దని ఏఐసీసీ సూచించిందని, ఈ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు. తెలంగాణలో జరుగుతున్న యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు పాల్గొనవద్దన్నారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలు జరగకుండా, ప్రభావం చూపకుండా పారదర్శకంగా జరగాలంటే కాంగ్రెస్ నాయకులు ఎన్నికలకు దూరంగా ఉండాలని, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. దయచేసి నాయకులు అందరూ ఏఐసీసీ సూచనలు పాటించి యువజన కాంగ్రెస్ ఎన్నికలు ప్రజాస్వామ్య బద్దంగా సజావుగా జరిగేలా సహకరించాలని వెలిచాల రాజేందర్ రావు విజ్ఞప్తి చేశారు.

