Tuesday, March 17, 2026

తుమ్మలచెరువు బోటు షికారును సందర్శించిన ఐటీడీఏ పీవో రాహుల్

  • జిల్లా పేరు ఖండాంతరాలకు వ్యాపిస్తుంది
  • జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి

నేటి సాక్షి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జక్కుల సందీప్) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యాటకానికి సంబంధించిన ఎన్నో ప్రదేశాలు ఉన్నాయని కానీ వాటిని గుర్తించక అవి మరుగున పడిపోతున్నాయని, వాటిని వెలుగులోకి తీసుకొస్తే మన జిల్లా పేరు ఖండాంతరాలకు వ్యాపిస్తుందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.బుధవారం నాడు అశ్వాపురం మండలంలోని కాకతీయుల కాలం నాటి తుమ్మలచెరువును ఆయన దర్శించారు. పర్యాటకులు వస్తున్నది లేనిది స్వయం సహాయక గ్రూప్ మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా పర్యాటక స్థలాలను సందర్శించడానికి ఉత్సాహపడతారని అందుకోసం ఐటీడీఏ ప్రాంగణంలో గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ట్రైబల్ మ్యూజియం త్వరలో ప్రారంభిస్తామని, అలాగే బొజ్జుగుప్ప, కిన్నెరసానిలో బోట్ షికారు, కనిగిరి అందాలు దానిలో భాగంగా కాకతీయుల కాలం నాటి తుమ్మల చెరువులో బోటింగ్ షికారు చేయడానికి చాలా అణువుగా ఉందని అన్నారు.తుమ్మల చెరువు బోటి షికారింగు కు వచ్చే పర్యాటకుల పట్ల నిర్వాహకులు చాలా జాగ్రత్తలు పాటించాలని,తప్పనిసరిగా గజ ఈతగాళ్లు బోటింగ్ షికారు చేసే వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారు క్షేమంగా బోట్ షికారు చేసి వెళ్లేలా చూడాలని అన్నారు.అనంతరం సరదాగా చెరువులో బోట్ షికారు చేశారు.ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఎస్ ఓ ఉదయ్ భాస్కర్, జేడీఎం హరికృష్ణ,సెక్రెటరీ దినేష్ కుమార్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు సుప్రియ, తులసి, సరోజా, అమల, శృతి, పూర్ణ, నాగమణి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News