నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ (కోక్కుల వంశీ):
రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని జానపద కళాకారుని, జబర్దస్త్ ఫేమ్ వర్షిణి బుధవారం కుటుంబం సమేతంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకోగానే అర్చకులు, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనానంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వర్షిని మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వేములవాడ రాజన్నను రాజన్నను దర్శించుకోవడం కోసం వస్తున్నామని, ఈ సంవత్సరం కుటుంబ సభ్యులతో రాజన్న దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.





