Wednesday, April 1, 2026

మున్సిపల్ కమిషనర్ ను కలిసిన జేఏసి ప్రతినిధులు

నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు) :
హుజురాబాద్ మున్సిపల్ కమీషనర్ కే. సమ్మయ్యను జేఏసీ ప్రతినిధులు గురువారం నాడు ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిసారు. ఈ సందర్బంగా హుజురాబాద్ పట్టణంలోని సమస్యల గురించి చర్చించడం జరిగింది. ఇదే సమయంలో తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమీషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్ల తో టెలీ కాన్ఫెరెన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమీషనర్లతో మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ కే. సమ్మయ్య పని విధానాన్ని డైరెక్టర్ ప్రశంసించడం విశేషం. ఆస్తిపన్ను వసూళ్ళలో హుజురాబాద్ మున్సిపాలిటీ తీసుకుంటున్న చర్యలపై ప్రశంసలు చేస్తూనే,భవిష్యత్ లో తీసుకోబోయే కార్యాచరణపై డైరెక్టర్ మార్గదర్శనం చేశారు. మున్సిపల్ కమిషనర్ కే. సమ్మయ్య ను,సిబ్బందిని జేఏసీ ప్రతినిధులు కూడా అభినందించారు. మున్సిపల్ కమిషనర్ ను కలుసుకున్న వారిలో హుజురాబాద్ జే.ఏ.సి. చైర్మన్ ఆవునూరి సమ్మయ్య, కన్వీనర్ వేల్పుల రత్నం, ప్రజా సంఘాల నాయకులు పొడిశెట్టి వెంకట రాజం, పులి జగన్నాథం వున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News