నేటి సాక్షి, బెజ్జంకి: బెజ్జంకి మండలానికి చెందిన జడాల చంద్రశేఖర్ టీపీపీఎస్పీ ఐటీ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 184వ ర్యాంక్, డివిజన్ స్థాయిలో 27వ ర్యాంక్ సాధించి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఉద్యోగం పొందారు. ఈ సందర్భంగా బెజ్జంకి మండల కాంగ్రెస్ నాయకులు ఆయనను శాలువాతో సన్మానించి, స్వీట్లు తినిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నర్సింహులపల్లి గ్రామానికి చెందిన కుసుంబ సాయికిరణ్ అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబాన్ని మండల కాంగ్రెస్ నాయకులు పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ చిలివేరు శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మీనరసింహ దేవస్థానం చైర్మన్ జెల్లా ప్రభాకర్, డైరెక్టర్ బోనాల మల్లేశం, మాజీ సర్పంచ్ రావుల నర్సయ్య, కుసుంబ సంపత్, గ్రామ శాఖ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, జెట్టి చంద్రయ్య, శ్రీనివాస్, జెట్టి రమేష్, కుసుంబ తిరుపతి, మాజీ ఉపసర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ కుంట హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.





