- కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి


నేటి సాక్షి, కొమురం భీం ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్స్ ప్రక్కన నిర్వహించిన శ్రీ జగద్గురు నరేంద్ర చర్య మహారాజ్ గారి పాదుకా దర్శన కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు కోవ లక్ష్మి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జగద్గురు నరేంద్రచర్యజి మహారాజ్ గారి సేవలను కొనియాడారు. వారు దేశంలో అనేక సమాజ సేవలు చేస్తున్నారు అని అన్నారు.

మానవ సేవే మాధవ సేవ అని అన్నారు. అందరూ దైవ మార్గంలో నడవాలని సూచించారు జగద్గురు నరేంద్రచార్య జి మహారాజ్ గారి సేవలు అందరికీ అదర్షణీయకంగా ఉన్నాయని చెప్పారు అనంతరం వారి సంస్థ ద్వారా పెద అడ బిడ్డలకు కుట్టు మిషన్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మండల నాయకులు, కార్యకర్తలు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు





