- చెంగు చెంగున పరుగెత్తిన కోడె గిత్తలు
- కొమ్ముల పలకలు చేజిక్కుందుకు పోటీ పడ్డ యువత

నేటి సాక్షి ప్రతినిధి( తిరుపతి జిల్లా) : సంక్రాంతి పండుగల ముందే ముందే తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలో వేపకుప్పంలో జల్లికట్టు ప్రారంభమైంది. ఆదివారం నిర్వహించిన జల్లికట్టు పోటీలలో కోడె గిత్తలకు కట్టిన పలకలను దక్కించుకొనేందుకు పరుగులు పెడుతూ యువకులు పోటీపడే దృశ్యం చూసి వీలలతో కేరింతలు కొట్టిన యువతతో గ్రామం పండుగ వాతావరణం లో కన్నులపండువగా జరిగింది. ముందుగా గ్రామస్తులు కోడె గిత్తలకు కట్టిన పలకలను గ్రామ దేవత వద్ద ఉంచి పూజలు చేసిన తర్వాత కోడెగిత్తల యజమానులకు పలకలను అందించి కోడె గిత్తలు కొమ్ములకు పలకలను కట్టి యువత మధ్యన కోడె గిత్తలు పరుగులు పెడుతూ ఉంటే యువకులు ఉత్సాహంగా హుషారుగా పరుగెడుతూ కొమ్ముల పలకలు చేజిక్కుందుకు పోటీ పడే క్రీడలు చూస్తేందుకు తిరుపతి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నుండి అనేకమంది యువకులు ఈ జల్లికట్టు పోటీలలో పాల్గొని ఈ పోటీలలో పలు యువకులు గాయాలు కావడంతో వారిని సమీప ఆసుపత్రికి తరలించారు ఈ జల్లికట్టు క్రీడలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై రామాంజనేయులు కట్టు దిట్టమైన ఏర్పాటు చేశారు గ్రామస్తులు. ఈ సందర్భంగా వచ్చిన ప్రజలకు యువత కు త్రాగునీరు భోజన వసతి ఏర్పాటు చేశారు.

