నేటి సాక్షి, జమ్మికుంట : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పురపాలక సంఘం కార్యాలయంలో తేది: 20-03-2025 గురువారం రోజున మున్సిపల్ కమిషనర్ ఎండి ఆయాజ్ అధ్యక్షతన పశువుల వారం అంగడి మరియు తై-బజార్ ఫీజులు వసూలు చేసుకొనుటకు బహిరంగ వేలమును నిర్వహించబడింది. ఇట్టి వేలములో ఎవరూ వేలము పాట పాడనందున తిరిగి తేది: 25-03-2025 మంగళవారం రోజున ఉదయం 11.30 ని.లకు వేలము నిర్వహించబడును. కావున ఆసక్తి కలిగిన వారు వేలములో పాల్గొనదలచిన వారు, జమ్మికుంట పురపాలక సంఘం- కమిషనర్ పేరున ఏదైనా జాతీయ బ్యాంకు నుండి రూ॥ 2,00,000/- ల డిపాజిట్ డి.డి. రూపకముగా తేది: 24-03-2025 రోజున సా. 4.00 గం॥ల లోగా కార్యాలయములోని పౌర సేవా కేంద్రములో సమర్పించగలరు. అదే విధముగా రూ. 20,00,000/-ల సాల్వేన్సి సర్టిఫికేట్ మరియు నో-డ్యూ సర్టిఫికేట్లు డి.డి.తో పాటుగా జతపర్చగలని జమ్మికుంట, పురపాలక సంఘం కమిషనర్ ఎండి ఆయాజ్ తెలియజేశారు.





