Friday, March 27, 2026

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయాలి

  • జనసేన నాయకులు దేవర మనోహర్

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : జనసేన పార్టీ అధ్యక్షులు ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన పిఠాపురం లో ఈ నెల 14 వ తేదీ జరుగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దేవర మనోహర్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నియోజకవర్గం లోని ఆరు మండలాల్లో ఉన్న అధ్యక్షులు తో కలిసి చలో పిఠాపురం కార్యక్రమం పోస్టర్ ను ఆవిష్కరించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 నుంచి 2025 వరకు ప్రజా సమస్యల పై అనేక పోరాటాలు చేసాం. ఆ పోరాట ఫలితంతో ఎన్డీయే కూటమి అధికారాన్ని చేపట్టిందన్నారు. నాకు ఎమ్మెల్యే టిక్కెట్ వస్తే ఎలాంటి కసితో పనిచేస్తానో.. అంతే కసిగా పనిచేశాను ఎవరి దగ్గర ఎలాంటి సాయాన్ని ఆశించకుండా, సొంత ఖర్చులతో పార్టీ కార్యక్రమాలు చేపట్టానని తెలిపారు ఆర్థికంగా వెనుకబడంతో ప్రజలకు, ప్రజా సమస్యల పోరాటాలకు కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు – ప్రజలు, కార్యకర్తలు క్షమిస్తారని ఆశిస్తున్నాను అన్నారు. ఇకపై అందరికీ అందుబాటులో ఉంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేస్తానన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి, కార్యకర్తలు కష్టాలు తోడుగా, అండగా ఉంటాను తెలిపారు – పిఠాపురంలో మార్చి 14వ తేది జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగనున్నాయి ఈ కార్యక్రమాన్ని- జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. 6 మండల పార్టీల అధ్యక్షులు కేంద్ర పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు పిఠాపురం వచ్చే వారికి రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడమైనది. చరిత్రలో 100% స్ట్రక్ రేట్ సాధించిన ఏకైక పార్టీ జనసేన పార్టీ- వైసీపీని అదఃపాతాళం లోకి తొక్కుతాన్న మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్ నన్నారు- కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నిరంతరం రాష్ట్రాన్ని అన్నిరకాల అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News