నేటి సాక్షి గోదావరిఖని (రమేష్) : రామగుండం నూతన కమిషనర్ పదవీ భాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా. ఈరోజు రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో
కలిసి పలు అంశాలపై చర్చించిన ఐ.ఎన్.టి.యు. సి. నాయకులు. ముఖ్యంగా రామగుండం కమిషనరేట్ లోని శాంతి భద్రతల పరిరక్షణ, మత్తు పదార్థాల నియంత్రణ, బహిరంగ మద్యపాన నిషేధం వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పాటు సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, జనరల్ సెక్రటరీలు వికాస్ కుమార్ యాదవ్, ఎండీ అక్రం , జిల్లా అధ్యక్షులు దాస్, RG-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం, సెంట్రల్ నాయకులు మార్కండేయ, నవీన్ , రాజయ్య తదితరులు పాల్గొన్నారు.





