Thursday, March 19, 2026

జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు జనగామ కు అన్ని అర్హతలు ఉన్నాయి

  • గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తుకు నవోదయ విద్యాలయం ఎంతో అవసరం
  • కమీషనర్ ని కలిసి వినతి పత్రం అందజేసిన ఎంపీ డా. కడియం కావ్య
  • కేంద్ర పాఠశాల విద్య శాఖ సెక్రటరీ మరియు కేంద్ర నవోదయ విద్యాలయ సమితి

నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఢిల్లీలో నేడు కేంద్ర పాఠశాల విద్య శాఖ సెక్రటరీ సంజయ్ కుమార్ మరియు కేంద్ర నవోదయ విద్యాలయ సమితి కమీషనర్ ప్రాచీపాండే తో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జనగామ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేయాలని ఈ సందర్భంగా వినతి పత్రం అందజేశారు. జనగామ జిల్లాలో అత్యధికంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు బలహీన వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారని, ఈ ప్రాంతం తక్కువ అక్షరాస్యత రేటును కలిగి ఉందని తెలిపారు. జవహర్ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేస్తే ఎంతో మంది నిరుపేద విద్యార్థులకు ఉపయోగ కరంగా ఉంటుందని అన్నారు. జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్థలాన్ని కీటెయించడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. జనగామ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటు జరిగితే విద్యార్థులు ఇక్కడికి చేరుకోవడానికి మెరుగైన రవాణా సౌకర్యం ఉందని, ఇటు నేషనల్ హైవేతో పాటు రైల్ మార్గం కూడా అందుబాటులో ఉన్నట్లుగా ఎంపీ తెలియజేసారు. ఎంపీ అభ్యర్థన పట్ల కేంద్ర పాఠశాల విద్య శాఖ సెక్రటరీ సంజయ్ కుమార్, కేంద్ర నవోదయ విద్యాలయ సమితి కమీషనర్ ప్రాచీపాండే సానుకూలంగా స్పదించినట్లు ఎంపీ తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News