- జై బీఆర్ఎస్.. జై జై తెలంగాణ నినాదాలతో దద్దరిల్లిన జన్వాడ.
- బీజేపీకి బిగ్ షాక్… భారీ అనుచరగణంతో బీఆర్ఎస్ లోకి గౌడిచర్ల వెంకటేష్
- బోనాలు, కోలాటాలు, డప్పుల దరవులు, బాణసంచా మోతలతో మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి ఘన స్వాగతం
- భారీ క్రేన్ తో స్వర్గీయ ఇంద్రన్న విగ్రహానికి భారీ పూలమాల వేసిన అభిమానులు
- గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్ లోకి వెంకటేష్ ను ఆహ్వానించిన సబితా ఇంద్రారెడ్డి, కార్తిక్ రెడ్డి
- సుమారు వేయి మంది అనుచరులతో బీఆర్ఎస్ లో చేరిన గౌడిచర్ల వెంకటేష్
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) : సంవత్సర కాలంలోనే అత్యధిక ప్రజావ్యతిరేక మూటకట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి జన్వాడ నుండే పతనం ప్రారంభం. గ్రామం నుండి ఏకంగా జిహెచ్ఎంసి లో కలపటం ద్వారా జన్వాడ గ్రామ ప్రజల బాధలు వర్ణనాతీతం. గ్రామ పంచాయతీగా కొనసాగించాలని ప్రజల డిమాండ్. కనీసం మునిసిపాలిటీగా అయిన మార్చిన ఒప్పుకుంటాం కానీ గ్రేటర్ మునిసిపాలిటీ కార్పొరేషన్ లో మార్చవద్దని మోర పెట్టుకున్న ప్రజలు. గ్రామమే ముద్దు మునిసిపాలిటీ వద్దు అంటూ ఏకగ్రీవంగా తీర్మానించి,ప్రతిజ్ఞ చేసిన జన్వాడ గ్రామస్థులు. సబితా ఇంద్రారెడ్డి మాజీ మంత్రి స్పీచ్ పాయింట్స్ తెలంగాణ కు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష. వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే, ఎగిరేది గులాబీ జెండానే.
చేవెళ్ల నియోజకవర్గముతో మా కుటుంబానికి విడదీయరాని అనుబంధం. గత ప్రభుత్వ హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశాము. కేటీఆర్ పాదయాత్ర చేసిన రోడ్డును నిర్మించుకున్నాం. సంవత్సరం గడిచింది మాటలు కోటలు దాటుతున్న ఎలాంటి అభివృద్ధి జరుగలేదు.
మైకు పడితే కేసీఆర్ ని తిట్టడం తప్ప ప్రజలకు ఎం చేస్తారో చెప్పటం లేదు. ప్రజలు మూడు సార్లు దరఖాస్తులు చేసుకున్నారు.ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనాలు పొందలెరు. ప్రజాపాలనలో గ్రామ సభలు అంటూ 26 జనవరి అన్ని ఇస్తాం అని మండలానికి ఒక చిన్న ఊరికే పరిమితం చేశారు. గ్రామాల్లో రుణమాఫీ కానోళ్లు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెట్టిన సర్వే లొనే కేసీఆర్ పాలన కావాలని 70 శాతం మంది ప్రజలు కోరుకున్నారు. కాళేశ్వరం కట్టి, ప్రతి ఎకరాకు నీరు అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దే. అటు చినుకులు పడుతుంటే ఇటు రైతుల ఖాతాల్లో డబ్బులు పడేవి. నాడు కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా చేసిన పనులతో నేడు ప్రతి ఇంటికి నీరు వస్తుంది. 24 గంటల విద్యుత్, రోడ్లు,గురుకులాలు,పాఠశాల భవనాలు,సమీకృతా కలెక్టర్ సముదాయాలు నిర్మించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. ఈ ప్రభుత్వ హయాంలో 58 మంది విద్యార్థులు విషహరం తిని చనిపోయారు. ఉపాధి లేక ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పోలీసులు, అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబెర్ నుండి జడ్పీ చైర్మన్ వరకు గులాబీ జెండాలు ఎగరాలి.ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. జన్వాడ ను మునిసిపాలిటీ లో కలపవద్దని అసెంబ్లీలో ప్రశ్నించిన వినలేదు. ఏకపక్షంగా వ్యవహరించారు.
బంజారాహిల్స్ లో కట్టే టాక్స్ జన్వాడ లాంటి గ్రామాల ప్రజలు కట్టలేరు. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఏకపక్షంగా విలీనం చేశారు… న్యాయ పోరాటం చేస్తాం..ప్రజలకు అండగా ఉంటాం. రెండు వేల పెన్షన్ 4 వేలు ఇస్తామని,మహిళలకు 2500 ఇస్తామని,కల్యాణ లక్ష్మీ లక్షతో పాటు తులం బంగారం, రైతు బంధు 15 వేలు ఇస్తామని ఒక్క సారి ఎగ్గొట్టి సంక్రాంతికి ఇస్తామని నేటికి రాలేదు. జన్వాడ గ్రామంలో మహాలక్ష్మి పేరుతో ఆడబిడ్డ పుడితే 16 వేలు ఇస్తున్న వెంకటేష్ అభినందనీయుడు. అబద్ధాల హామీలతో గద్దెనెక్కి, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని కార్తీక్ రెడ్డి పిలుపునిచ్చారు. జన్వాడ గ్రామాన్ని ప్రజల కోరిక మేరకు మునిసిపల్ లో కలపవద్దని డిమాండ్ చేశారు. చేవెళ్ల బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని ఎప్పుడు ఎన్నికలు వచ్చిన తప్పక గెలుపు సాధిస్తాం అన్నారు. గ్రామ ప్రజల కోరిక మేరకు జన్వాడ గ్రామాన్ని మునిసిపాలిటీ లో కలుపవద్దని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు గౌడిచర్ల వెంకటేష్ పేర్కొన్నారు.నేడు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి వేలాదిమంది అనుచరులతో సబితా ఇంద్రారెడ్డి, కార్తీక్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.పట్లోళ్ల కుటుంబానికి ఎప్పటికి అండగాఉంటామన్నారు.జన్వాడ గ్రామం బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. తన అన్న గ్రామ తాజా మాజీ సర్పంచ్ నరసింహా, గ్రామ పెద్దలు, పార్టీ పెద్దల సహకారంతో పార్టీ పటిష్టత కోసం పాటు పడతామన్నారు. మండల పార్టీ అధ్యక్షులు గండిచర్ల గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువ నేత, జాతీయ మీడియా స్పోక్స్ పర్సన్ పి కార్తీక్ రెడ్డి, మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు దేశమోళ్లఆంజనేయులు, శంకర్ పల్లి సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ కె. నారాయణ, మాజీ మార్కెట్ చైర్మన్ మానిక్ రెడ్డి, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కురుమ వెంకటేష్, బీఆర్ఎస్ నాయకులు గౌడిచర్ల నరసింహా, నాగేందర్, కేశం గోపాల్, అశోక్, గౌడిచర్ల రాములు, సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్, లింగం, ఎజాస్,పి. సురేష,కె. శ్రీను, సి.హెచ్. వీరయ్య, జాఫర్, ఏ రాములు, నరసింహ రెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, ఫరిద్, తదితరులు పాల్గొన్నారు.





