Monday, March 16, 2026

మార్కండేయ దేవాలయంలో జయంతి వేడుకలు

నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి.(రాఘవుల శ్రీనివాసు):
శ్రీ శివ భక్త మార్కండేయ జయంతి సందర్భముగా హుజూరాబాద్ మండల కందుగుల గ్రామ మార్కండేయ దేవాలయంలో జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగినాయి. వేకువ జామునే వేధ బ్రాహ్మణులచే అభిషేక కార్యక్రమములు మొదలయ్యాయి. నవగ్రహ పూజ, పంచోపచార పూజ మరియు హోమ కార్యక్రమములు నిర్వహించారు. మధ్యాహ్న సమయములో అన్నదాన కార్యక్రమము నిర్వహించారు. ఇట్టి కార్యక్రమలకి భక్తులు గ్రామప్రజలు అధికసంఖ్యలో పాల్గోని ఆ దేవుని ఆశీస్సులు తీసుకున్నారు. సాయంత్ర సమయాన మార్కండేయ శోభ యాత్ర గ్రామమంత వైభవోపేతంగా జరిగింది. గ్రామ ప్రజలంధరు మంగళ హారతులతో కొబ్బరి కాయలతో స్వామివారికి స్వాగతం పలికారు. ఇట్టి కార్యక్రమాన్ని ఆలయ చైర్మన్ అక్కేపల్లి జనార్దన్, ఇప్పలపల్లి రాజమౌళి, తలకొక్కుల వెంకటస్వామి, ఇప్పలపల్లి శ్రీనివాస్, కుస్మా రవి, అక్కేపల్లి దుర్గయ్య మరియు యువకులు ప్రదీప్, శ్రీకాంత్, అరవింద్, అనిల్, శివ, రామకృష్ణ, వెంకటేష్ తధీతరులు నిర్వహించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News