నేటి సాక్షి, ఎండపల్లి (రియాజ్): మండలంలోని కొత్తపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతా రామాంజనేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని నిర్వహించనున్న శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిమిత్తం అనవసరమైన శివపార్వతుల ఉత్సవ విగ్రహాలను గ్రామ వాస్తవ్యులు, సామాజిక సేవకులు జీరెడ్డి అనుష మహేందర్ రెడ్డి దంపతులు బహుకరించి తమ భక్తిని చాటుకున్నారు. కాగా మంగళవారం తమ వివాహ వార్షికోత్సవం సందర్భంలో శివపార్వతుల విగ్రహలను బహుకరించడం చాలా సంతోషంగా ఉందని జేఎంఆర్ దంపతులు అన్నారు. ఉత్సవ విగ్రహాలు బహుకరించిన దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతారామఆంజనేయ స్వామి ఆలయ కమిటీ పాలక మండలి సభ్యులు, గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.




