నేటి సాక్షి, మందమర్రి:
సింగరేణిలో పనిచేస్తూ అనారోగ్య సమస్యలతో అండర్ గ్రౌండ్ అన్ ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ లాంటి టెక్నీషియాలకు ఉద్యోగ భద్రత వెంటనే అమలు చేయాలని సింగరేణి మైనింగ్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ (హెచ్ఎంఎస్) ఏరియా ఉపాధ్యక్షుడు జే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని యూనియన్ కార్యాలయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 20 ఏళ్ల నుండి అండర్ గ్రౌండ్ అన్ ఫిట్ అయిన మైనింగ్ స్టాప్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ లాంటి టెక్నీషియన్లకు ఉద్యోగ భద్రత లేకుండా, వారు మానసికంగా బాధపడేలా, అండర్ గ్రౌండ్ అన్ ఫిట్ అయితే సర్ఫేస్‌లో జనరల్ మజ్దూర్ లుగా నియమించడం జరిగిందని గుర్తు చేశారు. ఇంత దారుణమైన స్థితిని మార్చి, దిక్కు లేకుండా గత పదేళ్ల టిబిజికేఎస్ హయాంలో అడిగే దిక్కు లేక, వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. ఎంతమంది మైనింగ్, టెక్నీషియన్ లను జనరల్ మజ్దూర్ లుగా డీప్రమోట్ చేశారో వారందరిని బేషరతుగా వారి వారి పాత డిజిగ్నేషన్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సింగరేణి అభివృద్ధిలో భాగంగా ఇతర రంగాలైన థర్మల్, సోలార్, హైడ్రో, విండో లాంటి రంగాల్లో సింగరేణి ప్రవేశించడం శుభసూచకమని, కానీ అక్కడ ఉపాధిని ప్రైవేట్, కాంట్రాక్టు కార్మికులతో కాకుండా సింగరేణి కార్మికులతో పని చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ నాయకుడు వెల్ది సుదర్శన్, నాయకులు చొప్పరి రామస్వామి, రాయమల్లు, అశోక్ కుమార్, సంతోష్ లు పాల్గొన్నారు.





