- జోగినాథ్‌ను పలకరించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
నేటి సాక్షి, అందోల్: జోగిపేట ఏఏంసీ మాజీ చైర్మన్, రైల్వే సాధన సమితి కన్వీనర్ గంగా జోగినాథ్ గుప్తా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు బస చేసిన బంగళా వద్ద కనిపించిన జోగినాథ్‌ను ‘ఏరా జోగీ.. బాగున్నావా’.. అంటూ చంద్రబాబు పలకరించారు. ఆయనే స్వయంగా జోగినాథ్‌ను తనవద్దకు పిలిపించుకుని, ఎక్కడికి వచ్చావ్? ఏం పనిమీద వచ్చావ్? అంటూ అడిగి తెలుసుకున్నారు.
జోగిపేట రైల్వే లైను కోసం కేంద్ర మంత్రులను కలిసేందుకు వచ్చానని, మీ సహకారం కూడా కావాలని కోరారు. చంద్రబాబు నాయుడు రెండవసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన సందర్బంగా శాలువాతో సత్కరించారు.
ఇటీవల లోకసభలో మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు జోగిపేట రైల్వేలైను ఏర్పాటు ఆవశ్యకతపై మాట్లాడడంతో సంబంధిత శాఖ మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర బీజేపీ కేంద్ర మంత్రులను కలిసేందుకు జోగిపేటకు చెందిన బీజేపీ నాయకులు ఢిల్లీలోనే ఉండి రైల్వే లైన్ సాధన కోసం కృషి చేస్తున్నారు.