నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : మల్దకల్ మండలంలోని వాయలకుంట దగ్గర చికెన్ షాప్ వాళ్ళ కోడి వేస్ట్ పదార్థాలు అక్కడ వేయడం వలన కుక్కలు వాటిని తినడానికి వచ్చి రోడ్డుకు అడ్డంగా తిరగడం వలన చాలా ప్రమాదాలు కూడా జరిగి మనుషులు చనిపోవడం జరిగింది. కాబట్టి డిపిఓ గారికి వినతి పత్రం అందజేశారు అదేవిందగా గ్రామ పంచాయతీ కార్యదర్శి కి ఎన్నోసార్లు చేప్పిన పట్టించుకోవడం లేదు అని చెప్పటం జరిగింది. కాబట్టీ వెంటనే కోడి వేస్ట్ పదార్థాలు అన్నిటినీ అక్కడ వేయకుండా డంపింగ్ యార్డు లో వేయించాలని కోరారు ప్రజలు ఆ డస్ట్ వేస్ట్ వేయడం వల్ల వాహన దారులు వాసన కి తట్టుకోలేక పోతున్నారు. కాబట్టీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వినతి పత్రం అందజేశిన వారు నదిగడ్డ హక్కులు పోరాట సమితి నాయకులు ప్రేమ్ రాజ్ మరియు జోగులాంబ గద్వాల్ జిల్లా ఆర్ఎస్పీ టీమ్ జిల్లా అధ్యక్షులు బండారి సునంద్ పాల్గోన్నారు.





