నేటి సాక్షి, వేమనపల్లి : వివిధ గ్రామాలకు చెందిన పలువురు బిజెపి మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆధ్వర్యంలో బుధవారం పార్టీలో చేరారు.బిజెపి పార్టీలో చేరిన వారు జంబోజి ప్రభాకర్, దుర్గం వెంకటి, చౌదరి లచ్చన్న,మడే రాహుల్, కళ్యాణ్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు మడె శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి ఎనుముల వెంకటేష్, సీనియర్ నాయకులు పుల్లయ్య, బిజెవైఎం మండల అధ్యక్షులు కంపెల అజయ్ కుమార్, కుబిడే అంజన్న, చౌదరి మధునయ్య, తీగల సతీష్, మడె సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.





