Thursday, March 19, 2026

విలేకరుల ముసుగులు అక్రమ దందాలు

  • ప్రజలను మోసం చేస్తున్న ముఠా గుట్టురట్టు
  • ఏడుగురిని అరెస్టు చేసిన నీల్వాయి పోలీసులు
  • అమాయక ప్రజలను బెదిరింపులు
  • పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు
  • నిందితుల నుంచి కారు,90వేల నగదు స్వాధీనం
  • కేసు నమోదు రిమాండ్ కు తరలింపు

నేటి సాక్షి, వేమనపల్లి : విలేకర్ల ముసుగులో అక్రమ దందాలు కొనసాగిస్తున్న బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్న ఏడుగురు విలేకరులపై నీల్వాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు తెలిపారు.నీల్వాయి పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు.బాధితుడూ జక్కుల శ్రీధర్,మొగలి అనిల్ సుంపుటం గ్రామంలో ఆరు ఎడ్లను కొనుగోలు చేసి పెద్దపల్లి పశువుల సంతకు తరలిస్తున్న సమయంలో ఈ దొంగ విలేకరుల అరాచకం బయటపడింది. ఏడుగురు విలేకర్లు రిమాండ్ వివిధ పత్రికలో పని చేస్తున్న చొప్పదండి జనార్ధన్, మాసాని రమేష్, తగరం వెంకటేష్, తోడేటి సంతోష్, జిల్లపల్లి పోచం, దొబ్బల విష్ణు, తుంగ రమేష్ లుగా గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. వీరు ఏడుగురు గ్రూపుగా ఏర్పడి ఒక సంవత్సరం నుండి చుట్టుపక్క మండలాలతో పాటు గ్రామాలలో తిరుగుతూ వాహనాలను ఆపి నకిలీ విలేకరుల అవతారమెత్తి వచ్చే వాహనాలను బట్టి డబ్బులు వసూలు చేశారు.వీరు గతంలో కూడా చాలా వాహనాలన వద్ద అమాయక ప్రజలను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారని జక్కుల శ్రీధర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా వీరి నుండి రూ. 50 వేలు ఫోన్ పే ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకుని అవి చాలాది అన్నట్టు ఇంకో రూ. 30వేలు కావాలని డిమాండ్ చేయడంతో బాగోతం బయటపడింది. ఇలాంటివే సంఘటనలు ఇంకా జరిగాయి.గాదే మహేష్ వ్యక్తి ని బెదిరించి రూ. 30వేల రూపాయలు తీసుకున్నారని తెలిపారు. లక్షిట్టిపేటకు చెందిన చల్ల కుమార్ వద్ద నుంచి డబ్బులు ప్రాణహిత తీరంలో జనగామ ఆల్గామ మధ్యలో పంట చేన్లో ఉన్న తేకు దుంగలను ఫారెస్ట్ అధికారులకు పట్టిస్తామని యజమాని దగ్గర రూ. 9 వేలు తీసుకున్నారు. ఒక కారు తీసుకుని దానికి ప్రెస్ అని బోర్డు వేసుకొని హల్చల్ చేశారు.వారి నుండి ఒక కారు, రూ. 90వేలు నగదు, ప్రెస్ డూప్లికేట్ ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిని బెల్లంపల్లి కోర్టులో హాజుపరిచి వారిని రిమాండ్ కు తరలించడం జరుగుతుందని తెలిపారు.

ఎవరిని ఉపేక్షించేది లేదు: ఏసిపి
విలేకరుల ముసుగులో అక్రమదందాలతో అందిన కాడికి దండుకోవడం రివాజుగా మారిందనే తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి చట్ట విరుద్ధంగా చర్యలు ఉపేక్షించేది లేదని ఏసీపీ ఈ సందర్భంగా హెచ్చరించారు.కొంతమంది విలేకరులు కాకపోయినా ద్విచక్ర వాహనాలకు,కార్లకు ప్రెస్ స్టిక్కర్లు అంటించుకొని ఐడి కార్డులు తయారుచేసుకొని అక్రమ దందాలు కొనసాగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఎవరైనా వ్యాపారస్తులు పర్మిషన్ ఉంటే రాత్రిల్లో తీసుకెళ్లకూడదని కోరారు.

ప్రత్యేక అభినందనలు:
వ్యాపారస్తులను, అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న విలేకరుల ముఠాను గుట్టు రట్టు చేసిన నీల్వాయి ఎస్సై శ్యాం పటేల్ నీ చెన్నూరు రూరల్ సీఐ సుధాకర్, జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News