నేటి సాక్షి, రామగిరి : అక్రిడిటేషన్ కార్డులతో సంబంధం లేకుండా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులో రాయితీ ఇవ్వాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు రామగిరి నాయబ్ తహసీల్దార్ యజ్ఞంభట్ల మానసకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. డీజేఎఫ్ జాతీయ అధ్యక్షుడు మనసాని కృష్ణారెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు మోటాపలుకుల వెంకట్ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కళ్లేపల్లి కుమార్, ఉపాధ్యక్షుడు కన్నూరి రాజు ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. అక్రమ కేసుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి సబితం లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి బోయిని ప్రసాద్, కోశాధికారి పెయ్యాల రమేష్, సభ్యులు సిద్ధం ప్రదీప్ కుమార్, దాసరి భరత్, ఐలి సాయి కృష్ణ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

