నేటి సాక్షి, ప్రతినిధి వనపర్తి జిల్లా 27 : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి పాలాభిషేకలతో కృతజ్ఞతలు తెలియజేస్తున్న అన్నదాతలు.రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకం అమలుపై అన్నదాతలు ఆనందోత్సవాలు జరుపుకుంటున్నారు.కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి చిత్రపటాలకు అన్నదాతలు పాలాభిషేకం నిర్వహిస్తున్నారు.ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అన్నదాతలను గుండెల్లో పెట్టి చూసుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమేనని రైతులు పేర్కొంటున్నారు.





