జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి సాక్షి, మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-
పర్యావరణ పరిరక్షణతో పాటు పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంలో భాగంగా జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జంగల్ సఫారీ ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లాలోని లక్షెట్టిపేట రేంజ్-కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలోని హాజీపూర్ మండలం ర్యాలీ గడ్ పూర్ గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన జంగల్ సఫారీ కార్యక్రమాన్ని జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల సౌకర్యం కొరకు జంగల్ సఫారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దేశంలోని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలలో పులులు, ఇతర వన్యప్రాణుల సంరక్షణ కొరకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగా జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణుల సంరక్షణ కొరకు ప్రత్యేకంగా పర్యవేక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, డి.సి.సి. అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





