నేటి సాక్షి, మెట్ పల్లి: పట్టణంలోనీ మొదటి, పద మూడవ వార్డులలో జరుగుతున్న వార్డ్ సభ లో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు,ఇందిరమ్మ ఇల్లు అందుతాయని అన్నారు. రేషన్ కార్డు లిస్ట్ లో పేరు లేదని ఎవరు బాధపడవద్దని అప్లికేషన్ల స్వీకరణ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. సoబంధిత అధికారుల దగ్గర అర్హులైన వారు ఎప్పడు అయిన దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మోహన్,వార్డు కౌన్సిలర్ లు బాల్క ముత్తమ్మ,మార్గం హన్మాండ్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.





