నేటి సాక్షి, పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : ఇటీవల సోదర వియోగం చెందిన కళింగ నాయకుడు ఎన్ని ధనుంజయరావుకు బుధవారం కళింగ నాయకులు పరామర్శించారు. ధనుంజయ సోదరుడు ఎన్ని చెల్లయ్య ఇటీవల బ్లడ్ క్యాన్సర్ మూలంగా మృతి చెందిన విషయం విదితమే. ఈ సందర్భంగా కళింగ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షులు బి.వి.ఎస్.ఎన్.రాజు మాట్లాడుతూ చెల్లయ్య సౌమ్యుల, వివాదాలకు దూరంగా ఉండేవారని, అలాంటి వ్యక్తి మరణించడం బాధాకరమని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి 57 ఏళ్లకే మరణించడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా చెల్లయ్య కుటుంబానికి, అతని సోదరుడు ఎన్ని ధనుంజయరావుకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. పరామర్శించిన వారిలో సీపాన రామారావు, పలువురు కళింగ నాయకులు ఉన్నారు.





