నేటి సాక్షి పలాస కాశీబుగ్గ, రమేష్ కుమార్ పాత్రో : ఇటీవల స్వర్గస్తులైన సువ్వారి అచ్చం నాయుడు మాస్టారు కుటుంబానికి శనివారం కళింగ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా కళింగ సంక్షేమ సేవా సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పొట్నూరు సూర్యం మాట్లాడుతూ సమాజ హితులున్నారు. ఆయన పోరాట పతిమ ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా కళింగ సంక్షేమ సేవా సంఘం జాతీయ గౌరవ అధ్యక్షులు బుడుమూరు శ్రీరామమూర్తి మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగ నాయకుడిగా అచ్చం నాయుడు మంచి పేరు గడించారన్నారు. జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ కళింగ గ్లోబల్ ఫెడరేషన్ అధ్యక్షులు బి.వి.ఎస్.ఎన్. రాజు మాట్లాడుతూ అచ్చంనాయుడు మాష్టారు రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రులతో, సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఉపాధ్యాయ సమస్యలపై విరివిగా చర్చించి పరిష్కారాలు అందించిన వ్యక్తి అని అన్నారు. ఎందరో విద్యార్థులను ఉన్నత విద్యావంతులను చేసి సమాజానికి అందించారన్నారు. వారంతా ఇప్పుడు వివిధ స్థాయిలలో ఉన్నారన్నారు. కళింగ నాయకులు, బూర్జ వైస్.ఎంపిపి బుడుమూరు సూర్యారావు మాట్లాడుతూ అచ్చంనాయుడు మాష్టారు నిజాయితీకి ప్రతిరూపమన్నారు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. అంతకు ముందు వారంతా ఇటీవల పుత్రవియోగం చెందిన విశ్రాంత ఆర్.జె.డి పాత్రుని పాపారావును పరామర్శించారు.

