ఆర్టీఓ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించిన ‘కమటాల’
నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో:
జగిత్యాల జిల్లా రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఓ )సభ్యులుగా జగిత్యాల పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు కమటాల శ్రీనివాస్ నియామకమాయ్యరు. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజు ఉత్తర్వులు జరిచేయగా సోమవారం జగిత్యాల ఆర్టీఓ శ్రీనివాస్ సమక్షంలో కమటాల శ్రీనివాస్ బాధ్యతలు తీసుకున్నారు. శ్రీనివాస్ ప్రస్తుతం జగిత్యాల వర్తక సంఘం అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. శ్రీనివాస్ నియామకానికి సహకరించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డిలకు శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.ఆర్టీఓ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ ను ,జగిత్యాల జిల్లా రవాణా శాఖాధికారి శ్రీనివాస్, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి,జగిత్యాల పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఉటూరి నవీన్ కుమార్, సీనియర్ పాత్రికేయులు టీవీ సూర్యం, పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి, పల్లెర్ల రాజు, పెద్ది శ్రీనివాస్, బొడ్ల రాజు తదితరులు అభినందించారు.





