నేటి సాక్షి, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ కర్ర పని వారి సంఘ భవనంలో నూతన కమిటీని సంఘ సభ్యులు శుక్రవారం ఎన్నుకున్నారు. కర్రపని సంఘం అధ్యక్షుడిగా ముగ్గురు పోటీ పడగా డ్రా సిష్టం ద్వారా కంచర్ల రవి ఎన్నికయ్యారు. తద్వారా గౌరవ అధ్యక్షులుగా కంచర్ల బ్రహ్మచారి, ప్రధాన కార్యదర్శి కంచెర్ల రామస్వామి, సహాయ కార్యదర్శి కంచర్ల శ్రీనివాస్ బ్రహ్మయ్య, ఉపాధ్యక్షులు కంచెర్ల బంగ్ల సత్తయ్య, కోశాధికారి కంచర్ల సత్యనారాయణ, ప్రచారకర్త కంచర్ల మొగిలి, డైరెక్టర్లుగా కంచర్ల సత్యం, కంచెర్ల స్వామి. వీరందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు రవి మాట్లాడుతూ సంఘ సభ్యులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి, నా పదవి కాలంలో సంఘం అభివృద్ధికి పాటుబడతానని తెలిపాడు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ కర్ర పని సంఘ సభ్యులు పాల్గొన్నారు.




