- రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ – శ్రీరాములు అందెల
- సమావేశంలో పాల్గొన్న శ్రీరాములు అందెల
నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) : మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నిమ్మ అంజిరెడ్డి ఆధ్వర్యంలోనిర్వహించినటువంటి విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గంగాపురం వెంకట్ రెడ్డి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహారెడ్డి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ తో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీరాములు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వరంగల్ డిక్లరేషన్ సభలో రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మోసం చేశారని అన్నారు. అదేవిధంగా ఎన్నికలకు ముందు రైతు భరోసా కింద ఎకరానికి 15వేలు రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు మాట మార్చి 15వేలకు బదులుగా 12వేలు ఇస్తాం అని చెప్పడం..ఇలా సంవత్సర కాలం గడుస్తున్న రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. కేవలం స్థానిక ఎన్నికల్లో లబ్ధి చెందడం కోసం కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ప్రకటనలు చేస్తున్నారే తప్ప నిజంగా పూర్తిస్థాయిలో అమలు చేయరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుపరిచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి గ్రామానికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని, అలాగే బూత్ స్థాయిలో పార్టీని మరింత పటిష్టంగా చేసుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర నాయకులు మంద పాండు, బిజెపి సీనియర్ నాయకులు ఎగ్గిడి సత్తయ్య, మాజీ సర్పంచ్ లు ప్రభాకర్ బిక్షపతి, పర్వతాలు, నరసింహారెడ్డి, భూమిరెడ్డి, బీజేవైఎం నాయకులు దిలీప్ గౌడ్, అనిల్ ముదిరాజ్, శక్తి కేంద్ర ఇన్చార్జులు మరియు బూత్ అధ్యక్షులు పాల్గొన్నారు.





