నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : చంద్రగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన కార్యకర్తకు జోష్ నింపింది అందులో భాగంగానే నాగూర్ కాలనీ కి చెందిన దూదేకుల కులానికి చెందిన కరమల వల్లీ కి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు చంద్రగిరి నియోజకవ అనుబంధాల విభాగాల్లో అధ్యక్షులుగా నియమించిన విషయం తెలిసిందే అందులో భాగంగా మైనారిటీ సెల్ విభాగం నుంచి వైఎస్ఆర్ సిపి ఆవిర్భావం నుంచి క్రియా శీలకంగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న కరమల వల్లీని పార్టీ అధిష్టానం గుర్తించి మైనారిటీ సెల్ చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షులుగా నియమించింది పార్టీలో మొదటి నుంచి పనిచేసిన వారికి గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి కరమల వల్లీ నిదర్శనమని చెప్పకనే చెప్పవచ్చు కరమల వల్లీ మైనారిటీ నాయకులతో పాటు నియోజకవర్గం లో నాయకులు కార్యకర్తలతో కలిసి పోయే మనస్తత్వం, వాక్చాతుర్యం ప్రజలతో మమేకమై అందరితో స్నేహంగా ఉంటారు ఈ సందర్భంగా కరమల వల్లీ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మైనారిటీ నాయకులతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. అదేవిధంగా తనపై నమ్మకం ఉంచి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులుగా నియమించిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాజీ తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.



