- నియోజకవర్గ వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు
నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం హుజురాబాద్ పట్టణంలో ఘనంగా జరిగాయి. బిఅర్ఎస్ కార్యకర్తల, నాయకుల, అభిమానుల హర్షద్వానాలు, నృత్యాలు కేరింతల మధ్య అంబరానంటాయి. మహమ్మద్ అమాజదుల్లా ఖాన్, ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో కేక్ కట్ చేశారు. గురువారం రాత్రి నుండే హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు, మండల కేంద్రాలతో పాటు గ్ర్రామ గ్రామాన హోర్డింగ్, ప్లెక్షీలు, తోరణాలతో గులాబీమయం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్ణచందర్, ఇమ్రాన్, అర్షద్, అఖిల్, మున్వర్, షఫీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.