నేటిసాక్షి, గన్నేరువరం, (బుర్ర అంజయ్య గౌడ్):
గన్నేరువరం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళి, పోలింగ్ శాతం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాల బయట పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి తగు సూచనలు చేశారు.ఈ కార్యక్రమం లో గన్నేరువరం మండల పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, అలువాల కోటి, శ్రీధర్ రెడ్డి, అనంతరెడ్డి, సంగు వేణు, కటకం తిరుపతి, బి.సంపత్ రెడ్డి, నవీన్, నర్సింహారెడ్డి, బొడ్డు సునీల్, తిప్పర్తి పరిపూర్ణచారి, దొడ్డు మల్లేశం, డి.అనిల్, జె.మహేందర్,నక్క తిరుపతి, మల్లికార్జున్, తదితరులు ఉన్నారు.




